ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 

వస్తున్నారు ! వస్తున్నారు !
పంచాయతీ, మెంబర్లు,
తమ్ముడూ జాగ్రత్త !
   ప్రజల ఓట్లతో పదవులు
   గడించేవారు
   మారురూపాల కోటు
   తొడిగేవారు
   బూటకపు మాటలు
   తియ్యగ చెప్పేవారు
   ప్రజాసేవ పలుకుల
   కొంగజపాల దొంగలు వస్తున్నారు !
   వస్తున్నారు !
   తమ్ముడూ !! జాగ్రత్త !!!
నిన్న నీ కొంపార్చినవాడు
రేపిస్తాడట ! నీకో చోటు
కావాలంటే ఇచ్చిచూడు
అందుకే అంటాడు నీవోటు
వస్తున్నారు !
   తమ్ముడూ !! జాగ్రత్త !!!
నిన్నటి 'చీకటి మృగం'
రేపటి నీ 'మెంబరు'
వస్తాడు వేషం మార్చి
వేస్తాడు నీకే 'టోపి'
వస్తున్నారు !
తమ్ముడూ !! జాగ్రత్త !!!
తమ్ముడూ ! కళ్ళున్నవి నీకు
బుఱ్ఱకు వేడెక్కించుక
ఊబిలోకి దిగబోకు
నేటిపొరపాటు నీకే నరకం రేపు
వస్తున్నారు !
   తమ్ముడూ !! జాగ్రత్త !!!