ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
                                                    గుమాస్తా సంఘాధ్యక్షుని ప్రకటన

   సికింద్రాబాదు గుమాస్తా సంఘాధ్యక్షుడు శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామి గారిట్లు ప్రకటించుచున్నారు.
సుమారు 14 నెలల నుండి రెడీమేడ్‌ దుకాణాలు వారానికొకసారి మూసియుంచే విషయములో చేసిన పనిని నీట కల్పడానికి తీవ్రంగా కొందరు యజమానులు ప్రయత్నిస్తున్నారు. వీరు తాము చేసిన వాగ్ధానాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ, వారి వలనే ఇతర యజమానులు కూడా ప్రవర్తించాలని ప్రయత్నిస్తున్నారు. వీరు యజమానుల సంఘము యొక్క నిర్ణయాలను గాని, గుమాస్తా సంఘానికి లిఖిత పూర్వకంగా చేసిన వాగ్ధానాలను గాని పాటించుట అవసరమని తలచుట లేదు. అంతేకాక యజమానులకు గుమాస్తాలకు పరస్పరం గల అదరాభిమానాలు కూడ లేకుండ చేయచూస్తున్నారు. మొదటి నుండి అనగా 25.12.44 నుండి వారానికొకరోజు దుకాణాలు మూస్తూ యజమానులు చాలా సానుభూతితో సహాయం చేస్తూ, గుమాస్తాల కష్టాలు పోవడానికి చాలా కృషి చేశారు. అదే విధంగా గుమస్తా సంఘం కూడ యజమానుల ప్రేమను, ఆదరాభిమానాన్ని గుమాస్తాల శ్రేయోభివృద్ధికై ఉపయోగించుకుంటు, యజమానులకు గుమాస్తాలకు గల ఇట్టి పరస్పర సంబంధాన్ని ఇంకను దృడంగా శాశ్వతంగా నిల్పుకోవడానికి కృషిచేస్తు వచ్చింది.
   ఈ విధంగా వారానికొకరోజు సెలవు వంటి సామాన్య విషయములో కూడా ఈలాంటి అడ్డంకులు కలిగించడం యజమానులకు గుమాస్తాలకు పరస్పరంగల ప్రేమాభిమానాలను కలుషితం చేయడం ఎవరును మెచ్చుకోరు. కాబట్టి ఇదివరకు వలెనే తమ కార్యాలయ పద్ధతి విడువకుండా ఉంటు కొందరు చేయు కుతంత్రాలకు లొంగవలదని మొత్తము రెడీమేడ్‌ దుకాణాల యజమానులను, యజమానుల సంఘాల్ని కోరుతున్నాము.
   గుమస్తాలు కూడా తమ న్యాయమైనటువంటి సాధించునటువంటి హక్కును శాశ్వతంగా కలుపుకొనుటకు గట్టిగా నిలబడాలని, గుమాస్తా సంఘములో ఎక్కువ సంఖ్యలో సభ్యులుగా చేరి గుమాస్తాసంఘమును బలంగా నిర్మించి పొందిన హక్కులను నిలుపుకొనుటయేగాక, కొత్తగా సాధించాల్సియున్న హక్కులను పొందుటకు కృషి చేస్తూ, గుమాస్తాలును బలపడాలని గుమాస్తా సోదరులకు హెచ్చరించుచున్నాము.
   ఈ సందర్భమున రెడీమేడ్‌ దుకాణాల సంఘటనను గుణపాఠముగా హెచ్చరికగా తీసికొని ఇతర దుకాణాల్లో పనిచేసే గుమాస్తాలను జాగ్రత్తగా ఉండాలని, విరివిగా సంఘములో చేరి ఉన్న కష్టాలను, రానున్న కష్టాలను పరిష్కరించుకొనుటకు మొత్తము సికింద్రాబాదు గుమస్తా సోదరులను కోరుచున్నాము.
   యజమానులు గుమాస్తాలకు లిఖిత పూర్వకంగా చేసిన వాగ్ధానాన్ని కొందరు యజమానులు భంగం చేయడం క్రమపద్ధతి లేక పోవడం గమనించి కట్టుబాటుతో దుకాణాలు మూసి ఉంచడం మొదలగు విషయాలను పరిశీలించడానికి రెడీమేడ్‌ బట్టల యజమానుల సంఘం ఎన్నుకోబడింది. ఆ సంఘము వారు కూడ దుకాణాలు మూసియుంచే విషయములో గుమాస్తాసంఘానికి లిఖిత పూర్వకముగా చేసిన వాగ్ధానాన్ని దృష్టిలో నుంచుకొని నెలకు నాలుగు రోజులు అనగా మూడు సోమవారాలు, ఒక ఆదివారం దుకాణాలు మూసి యుంచుటకును అమావాస్య మొత్తము దుకాణాలు మూసి యుంచుతు చిట్టాల ప్రకారం జరిగే నిర్ణయానుసారం ప్రతి సోమవారం మూడు దుకాణాలు మాత్రం తెరిచియుంచుటకును అట్టి మూడు దుకాణాలు ఒక్కొక్కరు రూపాయి పావల యజమానుల సంఘానికి చెల్లించుటకు నిర్ణయించారు. ఆ ప్రకారం చిట్టాలు వేయడం జరుగుతునేఉంది. కాని ఈ పద్ధతిని కూడ కిందమీదు చేయడానికి కొందరు యజమానులు పూనుకున్నారు. యజమానులు తమ సంఘ నిర్ణయాలనే నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టారు. అందువల్ల గుమాస్తాలను ప్రేమించే యజమానులకును తమ విరామకాలాన్ని విజ్ఞానాభివృద్ధికై ఉపయోగించుకుంటున్న గుమాస్తాలకును చాలా బాధకలిగించింది. ఉన్న కష్టాలను, రానున్న కష్టాలను సంఘంలో చేరి పరిష్కరించుకోవాలనికోరుచున్నాను.
   నాయకుడుగాని, కార్యకర్తగాని, తాలూకుదారు గాని నగరపోలీసువారి అనుమతిలేనిదే నోరెత్తజాలడు 85 సభ్యులుగల శాసనసభలో వ్యవసాయదారులకు 16 స్థలములు ప్రత్యేకింపబడినవి. కాని హైదరాబాదు యొక్క ప్రస్తుత పరిస్థితులలో వ్యవసాయము వృత్తిగా గలవారు కారు. పటేలు పట్వారీ గిర్దారుల ద్వారా జిల్లా తాలూకాదారుచే నియమింపబడిన వారే వ్యవసాయ ప్రతినిధులై యుందురు. రాజ్యాంగ సంస్కరణముల విషయములో నాకెట్టి స్థానమున్నదో స్పష్టము నేను ఏ సంస్థకు చెందియున్నానో ఆ సంస్థ పక్షమున సంస్కరణములు అసంతృప్తిదాయకములనియు అంగీకారములనియు తెలుపబడినను నేను నా సంస్థయొక్క తీర్మాణమునకు బద్ధుడను. ప్రభుత్వము సంస్కరణముల సందర్భములలో ఎన్నికలు జరిపినచో నా ప్రవర్తన తేట తెల్లము. కొందరకు నేను సూచించిన నియామక పద్ధతి దుర్గ్రాహ్యముగా నుండవచ్చును. కాని నేను మీజాన్‌ ప్రతినిధి ద్వారా చేసిన ప్రకటనలో నియామకపద్ధతివలన నిర్మింపబడిన శాసనసభ ప్రప్రథమున అభివృద్ది మార్గమున నున్న భావములను దేశకాలావసరములను దృష్టియందుంచుకొని ఒక నియమావళి సిద్ధపరచవలసి యుండునని స్పష్టముగా చెప్పియుంటిని. ఈ షర్తుపైననే నేను నియామక పద్ధతిని సూచించితిని. ప్రభుత్వము ఈ షర్తునంగీకరించినచో నా నియామకపద్దతికి కూడ అస్థిత్వముండదు. కానీ నా ప్రకటనలోని ఈ విషయమును గమనించకయే, కేవలము నియామకపదము పై ఇంత గగ్గోలుపెట్టుట శోచనీయము.