ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
                                                    సికింద్రాబాదు సంఘాధ్యక్షుని ప్రకటన

   గత సంవత్సరంవలెనే ఈ సంవత్సరము కూడ గాంధీజయంతి బహిరంగ సభ జరుపుటకు సికింద్రాబాదు గుమాస్తాల సంఘము 7న అక్టోబరు 1945 ఆదివారము ఉదయం ఏర్పాటు చేయబడెను. అధ్యక్షులుగా శ్రీ అడివి బాపిరాజుగారు, ఉపన్యాసకులుగా శ్రీయుతులు విద్వాన్‌ విశ్వం, డా|| తిమ్మరాజు గార్లు మొదలగు ప్రముఖులు దయతో అంగీకరించిరి.
   ఈ సంగతిని 1వ అక్టోబరు 1945నాడు సికింద్రాబాదు డిస్టిక్ట్‌ మేజిస్ట్రీటుగారికి తెలిపితిమి. కాని 7వ తేదినకు ఏలాటి సమాధానము దొరకనందున సభను 14వ అక్టోబరు ఆదివారము జరుపుటకు నిశ్చయించి ఆసంగతిని తిరిగి డిస్టిక్ట్‌ మేజిస్ట్రీటు గారికి తెలిపితిమి. దానికి 11వ అక్టోబరునాడు సభకు అనుమతి ఇవ్వబడజాలదని ఇకముందు రాజకీయ సభలకు తృప్తికరమైన గడువుతో తెలుపవలసియుండునని ఒక సూచన చేసినారు.
   దానివల్ల ఈ సంవత్సరం గుమాస్తాల పక్షమున గాంధీజయంతి బహిరంగ సభ జరుపకుండా చేయబడినది. ప్రభుత్వము వారి ఈ వైఖరి సామాన్య పౌర స్వాతంత్య్రమును కూడా హరించుచున్నది. 1వ అక్టోబరునుండి 14 వ అక్టోబరు తేదీవరకు గల గడువు తృప్తికరముగా లేకపోవడం ప్రజల దౌర్బాగ్యమే.
   ఇంకొకవిషయం 6వ అక్టోబరు నాడు జేమ్సుస్టీటు పోలీసు ఆఫీసులో కనుక్కోగా సభకై రికమెండు చేయబడి 5వ అక్టోబరునాడే పోలీసు సూపరిడెంటు ఆఫీసుకు పంపబడినటుల తెలిసినది. సూపరింటెండెంటు ఆఫీసునుండి డిస్టిక్టు మేజిస్ట్రేటు ఆఫీసుపై వ్యవహారం నడపడానికి 14వ తేదీవరకు అనగా సుమారు వారం రోజులు చాలదనడం గమనించదగిన విషయం.
   అంతేగాక 14వ తేదీనాటికి వరకు తొందరపడి 11వ తేదివరకే అనుమతి నిరాకరిస్తూ చూపబడిన తొందరే 14 రోజుల్లో చూపినచో గడువు పరిమితి సమస్యయే బయలుదేరకపోవును. ఇవన్ని గమనించిన తర్వాత తేలేదేమంటే ఒకటి, ప్రభుత్వము వారు బుద్ధిపూర్వకముగా అనుమతి నిరాకరించడమైనా జరగాలె. లేదా ప్రభుత్వోద్యోగులు చూపిన అశ్రద్ధ మరియు ప్రజల వాంఛల యెడల నిర్లక్ష్యమైనా కావాలె.
   కానీ విచారణాంశమేమంటే పై రెండు విధములైన చర్యలవల్ల కలిగే ఫలితమును అనుభవించు దుర్గతి ప్రజలకు పట్టింది.
   మహాత్ముని వంటి కొత్త పురుషుడు భారతభాగ్య విధాత యొక్క జయంతికి సంబంధించిన బహిరంగ సభ విషయమే ప్రభుత్వము వారిట్టి వైఖరిని అవలంబిస్తే ప్రజల దైనందిన సమస్య లేవిధంగా పరిష్కరింబడుచుండునో ప్రజలూహించుకోగలుగుదురు.
   ముఖ్యముగా ఇట్టి ఘటనలు ఇక ముందు జరగకుండా ప్రభుత్వము వారు శ్రద్ధ తీసికొనుటయే గాక ప్రజలును అప్రమత్తులై యుండుటయు అవసరమని భావిస్తున్నాను.
                                                                                                       ఇట్లు
                          ఆళ్వారుస్వామి,
                          అధ్యక్షులు సికింద్రాబాదు
                          గుమస్తాల సంఘము