ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 

సాలార్జంగ్‌ కళానిలయం
చాటిందొక శాశ్వత సత్యం
   కనకానికి
   కట్టెపుల్లకు
   కోహినూరు వజ్రానికి
   కొండపల్లి బొమ్మకు
   ఇటలీ పాలరాతికి
   ఇంటిముందరి చొప్పబెండుకు
   కళలో భేదం లేదని
సాలార్జంగ్‌ కళానిలయం
చాటిందొక శాశ్వత సత్యం
   నూలుపోగు చేతబట్టి
   రంగుకుంచె నడిపించి
   సుత్తెకు సుందరతనేర్పి
   ప్రకృతినంత పట్టితెచ్చి
   పందిట్లో నిలబెట్టి
   (1)) 'నూర్జహాన్ను' చూపెదనని
సాలార్జంగ్‌ కళానిలయం
చాటిందొక శాశ్వత సత్యం
   మనిషి చూపు చొరగలేని
   మనిషిని మోహించలేని
   వస్తువు లేనేలేదని
  'వసుధంతా నీదే' అని
సాలార్జంగ్‌ కళానిలయం
చాటిందొక శాశ్వత సత్యం.
   పట్టుదల పరిశీలన
   ప్రధానాశయాలైన
   సాధకునకు తలఒగ్గని
   సమస్యలే లేవని
సాలార్జంగ్‌ కళానిలయం
చాటిందొక శాశ్వత సత్యం
   'తానే వలచింది రంభ,
   తానే మునిగింది గంగ'
   కాదు కాదు కాదంటూ
   విశ్వాన్నే ప్రదర్శించి
   విశ్వాదరణను పొంది
సాలార్జంగ్‌ కళానిలయం
చాటిందొక శాశ్వత సత్యం
   (2) 'ఒక్కడు చేసేదేముంద' ని
   బిక్క మొగము వేసేవారికి
   ఒక్కడేమి చేయగలడొ
   నొక్కి నొక్కి చెబుతున్నది.
(1) నూర్‌జహాన్‌ = విశ్వజ్యోతి,
(2) సుమారు 6 సంవత్సరాల క్రితం గతించిన సాలార్జంగ్‌ అనే ఒక్క జాగీర్దారు సేకరించిన వస్తువుల సంపుటమే సాలార్జంగ్‌ మ్యూజియం.