ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
               పదమూడో ఆళ్వార్‌
                   - దాశరథి కృష్ణమాచార్య

అసలు ఆళ్వార్లు పన్నెండు మందే
పదమూడో ఆళ్వార్‌ మా
వట్టికోట ఆళ్వార్‌స్వామి!
నిర్మల హృదయానికి
నిజంగా అతడు ఆళ్వార్‌
     దేవునిపై భక్తి లేకున్నా
     జీవులపై భక్తి ఉన్నవాడు
     తాను తినకుండా
     ఇతరులకు అన్నం పెట్టగలవాడు
     జైలు గోడలు మధ్య
     రంలో ప్రతి అణువూ
     ఆరోగ్య స్నానం చేసేరీతిని
     నిష్కల్మషంగా నవ్వగలవాడు
అతని కలం వజ్రాయుధం
అతనిది న్యాయపథం
అతన్ని మృత్యువు ప్రేమించింది
మృత్యువువంటి రాకాసి శూర్పణఖకు
అతడంటే ఇష్టం కలిగింది.
రాముడి తెలివితేటలు లేని అమాయకుడు ఆళ్వార్‌.
మృత్యువుకు బలియైపోయాడు
మమ్మల్ని వదిలేసిపోయాడు.
     అయినా ఎంతదూరం పోతాడతడు?
     మన హృదయాల మల్లె పందిళ్లకింద
     దోహదక్రియ జరుపుతుంటాడు.
     నీడలా వీడక మన వెంటవుండి
     వేడి వేడి ఆలోచనల పాయసం అందిస్తాడు.
     ఎక్కడ దు:ఖం ఉన్నా, బుద్ధుడిలా
     ఏగి, తోచిన సహాయం చేస్తాడు.
     అతడు ప్రజల మనిషి
     అతడంటే దుష్టులకు కసి.
     అబద్ధాసురుని పాలిటి తల్వార్‌ ఆళ్వార్‌
     అతను పోయినప్పటినుంచీ
     అమృత హృదయం విచ్చి
     నవ్వగలవాడు లేకుండాపోయాడు లోకంలో
     ఆళ్వార్‌ లేని లోకంలో
     అంధకారం ఆధిపత్యం చలాయిస్తుంది.
     అతడంటే చీకట్లకు భయం
     వెలుతురులకు జయం
స్వార్థం రాజరికం నెరపే లోకంలో
నిస్వార్థి అతడొక్కడంటే
అతిశయోక్తి అలంకారం అడ్డురాదు.
     ఆశ్రయింపు లెరుగనివాడు
     విశ్రాంతి తెలియనివాడు
     స్వసుఖం కోరనివాడు
     వారం వారం మారనివాడు
     రంగులద్దుకోలేనివాడు
     మనిషి మనస్సులో మంచినేగాని
     చెడు అనే మాలిన్యాన్ని వెతక తలపెట్టనివాడు
     మిత్రునికోసం కంఠం ఇవ్వగలవాడు
మంచికి పర్యాయపదం ఆళ్వార్‌.
అతనిదే సార్థకమైన జీవితం
అతనికీ అగ్నిధార అంకితం
        ('అగ్నిధార' రెండోకూర్పు అంకితం, 1963)
కేతవరపు రామకోటిశాస్త్రి పిహెచ్‌డి సిద్ధాంత గ్రంథం
తిక్కన కావ్యశిల్పము

అంకితము
శ్రీదేవతా ముఖాంబుజ పరీమళమందహాసునకు
ఆదరణీయ పార వివిధాత్మ గుణప్రసన్నునకు
ఈదృ గస్మదఖిలాభ్యుదయ హేలాలతాలవాలునకు
మోదమాన మన: పరిణతమూర్తి కాళ్వారుస్వాములకు
(పరీధావి సంక్రాంతి, 13-01-1973)