ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 

జంబి గురించి

ఆరు దశాబ్దాల ఆకాంక్ష, రెండు దశలుగా సాగిన తెలంగాణ మహోద్యమం విజయం సాధించింది. ప్రజాస్వామ్యంలో ప్రజా ఉద్యమాలు ఫలించక తప్పదని మరోసారి రుజువైంది. అమరుల బలిదానాల్లో ఆరిపోయిన ప్రాణాలు, కష్టాల నడుమ గాయాల నడుమ వొడితిరుగుతున్న కడుపుకోతలు, లక్షల గొంతులు చించుకోని ఎగిసిపడ్డ నినాదాలు, బిగుసుకున్న పిడికిల్లు, కుట్రల్ని కుటిలాల్ని ఎప్పటికప్పుడు ఎదిరించిన వ్యూహాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు, అక్షరాలు, ఆటపాటలు, కోటి ఆరాటాలు ఒక్కటై ఒక ఆధిపత్యాన్ని గెలిచినయి. విజయం తర్వాత పొందే ఒక సంబూరాన్ని తెలంగాణ పంచుకుంటున్నది. ప్రతి ఒక్కరికీ చరిత్రలో పాత్ర, విజయంలో భాగం కల్పించిన ఉద్యమం తెలంగాణ ఉద్యమమొక్కటే. మనకాలపు చరిత్ర, మనకండ్లముందటి విజయం.

కోట్లాది ప్రజల కండ్లల్ల వెలుగు విస్తరిస్తున్నది. కొత్త ఆశలు మొగ్గ తొడుగుతున్నయి. విజయం సరే. సంబూరం సరే. వికాసం వైపు అడుగులు పడవలసి ఉన్నది. స్థానిక వనరులు, సహజ సంపదలు ఇక్కడి ప్రజల బ్రతుకుల్లో పచ్చదనం నిలిపేందుకే వినియోగించాలి. కొత్త రాష్ట్రం ఫలాలు కొత్తతరం అందుబాటులోకి తీసుకురావాలె. విజయం తర్వాత సవాళ్ళు సహజమే. వివిధ అస్తిత్వాలు, వివిధ సమూహాలు తమ సందేహాలు వెలిబుచ్చడం తప్పనిసరి. వైరుధ్యాలుంటాయి. సంఘర్షణలుంటాయి. వాటన్నింటిని సవ్యంగా పరిష్కరించగలగాలె. ఆయా సమూహాల పరస్పర అవగాహన సాధించగలగాలె. అందరి ఆలోచనలు తెలంగాణను బంగారు తునకగా మార్చుకునే దిశగా కార్యరూపం దాల్చవలసి ఉన్నది.

తెలంగాణ ఉద్యమం అస్తిత్వ చైతన్యఫలం. వికాసం కూడా అస్తిత్వ పునాదుల మీదనే జరగాలె. అభివృద్ధి ప్రజాజీవితంతో అనుసంధానమవుతూ కొనసాగాలె. రేపటి తెలంగాణ నిర్మాణానికి రాజకీయ అస్తిత్వం, సాంస్కృతిక అస్తిత్వం రెండూ కీలకమైన పార్వ్శాలు. అవి బలంగా నిర్మాణమయినప్పుడే తెలంగాణ అస్తిత్వం పరిఢవిల్లుతది. ఆ ఎరుకతోనే కొత్త తెలంగాణ అవతరిస్తది.

తెలంగాణ భవిష్యత్‌ నిర్మాణంలో సాహిత్య అస్తిత్వం ముఖ్యమైనది. తెలంగాణ అస్తిత్వమంటే ఇతర ప్రాంతాల అస్తిత్వాలకు వ్యతిరేకం కాదు. తన చరిత్ర తిరగరాస్తుంది. తనను తాను నిర్మించుకుంటూ ఇతర అస్తిత్వాలను గౌరవిస్తుంది. ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తూ అన్నదమ్ముల ఆత్మీయతను కోరుకుంటది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఉమ్మడి సాహిత్యాన్ని ఉమ్మడి అభివృద్దిని సృజించటానికి, పంచుకోవటానికి కృషిచేస్తది. భాషగా కలిసుంటూనే భావనలెట్ల ప్రత్యేకమో విప్పి చెప్పుతది. ఆ దిశగా తెలంగాణ సాహిత్య అస్తిత్వ నిర్మాణం కోసం, మంచి వాతావరణం ఏర్పరిచేటందుకు ఒక అక్షర వేదిక అవసరమని భావించినం. ఉద్యమ హోరు దేశ సరిహద్దులు దాటి వీచినట్లే సాహిత్య వాతావరణం అల్లుకోవాలనుకున్నం. ఒక తీరు భావనలు ఒక చోట పంచుకునే సంచిక మనకోసం. మనందరికోసం.