ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
                                                                 దాశరథి జ్ఞాపకాలు

కవి సమ్మేళనంలో విశాలాంధ్ర నలుమూలలనుండి వచ్చిన కవులు శతాధికంగా పాల్గొన్నారు.

1953 జనవరి 12వ తేదీ చలి రాత్రి. తెల్లారేదాకా కవి సమ్మేళనం జర్గుతూనే ఉంది. సభామండపం శ్రోతలతో కిటకిటలాడిపోయింది.

కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరికీ 'దేశోద్ధారక గ్రంథమాల వారు (వట్టికోట ఆళ్వారుస్వామి) కాళోజీగేయ సంపుటిని బహూకరించారు.

                           *  *  *
   పలాశ పతాకలు

యేడు వందల మందికి ఒక్కటే పంపు:

   'యేట్టా భరించేది? యీ పాడుకంపు." అంటూ ఒక గేయం పాడుతూ వట్టికోట ఆళ్వారుస్వామి పంపు దగ్గరికి వచ్చాడు. "నిన్ను చూస్తే నాకూ కవిత్వం వస్తుంది" అన్నాడు. యేడువందలకుపైగా రాజకీయ ఖైదీలను నిజామాబాదు సెంట్రల్‌ జైలులో నిర్భందించారు. ఒక్కటే నీళ్ళపంపు. అంతా అక్కడే స్నానం చేయాలి, బట్టలుతుక్కోవాలి, భోజనం చేసి పళ్ళెరాలు, నీళ్ళుతాగే అల్యూమినియం గొట్టాలక్కడే కడుక్కోవాలి. ఉదయం ఆరు కానిదే బ్యారక్స్‌లోనుంచి బయటికి రానిచ్చేవారు కాదు బర్కందాజులు (వార్డెనులు).

                           *  *  *

   మేము వేలమెట్లు ఎక్కి కొండమీద జైల్లోకి ప్రవేశించేసరికి. పెద్దనాగుపాము ఎదురొచ్చి పడగ ఆడించి తుర్రుమన్నది. హడలిపోయా మంతా. శుభం: శుభం: అన్నారు కొందరు. జైల్లో ఆజానుబాహువు. నారింజపండు ఛాయలో వట్టికోట ఆళ్వారుస్వామి (ప్రజలమనిషి నవలా రచయిత) సాక్షాత్కరించారు. చిన్న చారల చడ్డీ, చారల అంగీ, చారల టోపి. ఇదీ అతని డ్రెస్సు. హంతకులకు ఇచ్చే దుస్తులు అతనికి ఇచ్చారు. ''ఇదేం కర్మ మామా! అన్నాను. ''నాకు శిక్షవేశారుగా? శిక్షితులందరూ ఈ హంతకుల దుస్తులు వేసుకోవలసిందే'' అన్నాడు. స్వాతంత్య్రంకోసం పోరాడే వీరులు హంతకుల దుస్తులు ధరించాలా? ఆ తెల్లవారి. మాకూ అవే దుస్తులు ప్రాప్తించినైలెండి.

(దాశరథి కృష్ణమాచార్య ఆత్మకథ 'యాత్రా స్మృతి' నుండి)

సేకరణ: డా. గంటా జలంధర్‌ రెడ్డి