ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 

               పాలేరు ప్రాజెక్టు రైతుల పాట్లు
                        - వట్టికోట ఆళ్వారుస్వామి

   కొన్ని మాసముల క్రిందట నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ పక్షమున కాలమాన పరిస్థితులను తెలిసికొనుటకై బయలుదేరిన సందర్భమున పాలేరు ప్రాజెక్టునకు సంబంధించిన విషయములు తెలిసి వచ్చినంతవరకు దిగువ వ్రాయుచున్నాను.
   ప్రాజెక్టు చరిత్ర
   ఈ ప్రాజెక్టు అనేక సంవత్సరముల కాలములో లక్షల రూపాయల వ్యయముతో నిర్మింపబడినది. ఈ ప్రాజెక్టులో అడుగుల నీరు నిలువ ఉండగలుగును. రెండు తూములు, వంపు తూము, మిట్టతూము, అను పేరిట గలవు. వంపుతూము ద్వారా ప్రాజెక్టులోని అడుగుల కన్న ఎక్కువ ఉన్ననే గాని నీరు లభించదు. వంపుతూము క్రింద చిన్న తూములు నిర్మింపబడినవి. క్రింద గ్రామము అందలి వేల యకరాల భూమియును మిట్టతూము క్రింది చిన్న తూములు నిర్మింపబడి గ్రామము అందలి వందల యకరముల భూమియును ఆయకట్టుగా నిర్ణయించబడినది. యకరముకి ధారా మొదలు () రూపాయల వరకు గలదు. వంపు తూము క్రింది మొదటి గ్రామములలో గల ఆయాకట్టు వేయి యకరముల భూమిలో వేయి యకరముల భూమి మిట్ట ప్రదేశమునందున్నందున నీరు అందక ప్రభుత్వము వారు తరీపన్నురద్దు చేసినారు అనగా ఈ విధముగా ఇంచుమించు వేల యకరాలకు పైగా నికరమైన ఆయాకట్టు ప్రభుత్వము వారి ఆలోచనలో నున్నటుల తలచవచ్చును.
   ఆయాకట్టు విపులీకరణ పద్దతి    ప్రాజెక్టు రెండుతూముల మధ్యయున్న, ప్రాజెక్టునకు పూర్వముగల పాలేరు నది మధ్యన గల భూములు తరీభూములుగా మార్చబడి ఆయాగ్రామ రైతులకు అంటగట్టబడెను. ఈ విధానమునవలంబించే కాలమందు నీరుఅందునా లేదా అను విచక్షణ ప్రభుత్వమువారు చేయలేదని తర్వాత రైతులు కష్టముల ఫలితముగకలిగిన అనుభవముచే తోచినది. ఫసిలీనుండి అనగా నీరు యిచ్చుట ప్రారంభమైన తర్వాత మొదటి రెండు సంవత్సరములు నిర్ణయపన్నులో మూడు భాగములు నాల్గవ సంవత్సరము పూర్తి పన్ను ఈ విధముగా రైతులనుండి తీసికొనబడెను. తర్వాత ఆయాకట్టు విపులీకరణ సందర్భములోను యిదే పద్దతి అవలంబించబడెను. నీరుయిచ్చువారు అబ్పాషిశాఖవారు, పన్ను తీసుకువారు భూమ్యాదాయ శాఖవారు.
   అనుభవమునకు, ఆదర్శమునకు సంఘర్షణ
   ఈ ప్రాజెక్టు క్రింద రైతుల కష్టములను సంబంధించిన విషయములను తెలిసికొను సౌలభ్యమునకై భూములను మూడు విధములుగా విభజించవచ్చును. అనుభూములు అనగా వంపుతూము క్రింది చిన్న తూముల క్రింది గ్రామములకు చెందిన భూములు. అనుభూములు అనగా వంపు తూము క్రింది గ్రామములుగాక తదితర గ్రాములలో గ్రామములకును, మిట్టతూము క్రింది గ్రామములకు చెందిన భూములు (ఇ) అనుభూములు అనగా వంపు తూము క్రింద మొత్తము గ్రామములలో పైన పేర్కొనినవి గాక మిగిలి గ్రామాలకు చెందిన భూములు.
   అ) అనుభూములకు అబ్బాషివారు ముఖకార్తెలోగా కాలనిర్ణయము లేకుండా వారి యిష్టము వచ్చినప్పుడు తప్పకుండా వదలెదరు. ఈ పద్దతిచే రైతులు వ్యవసాయము చేసుకొను సన్నాహములలో లోపములు జరుగుటకు అవకాశము కలుగుచున్నది. రైతుల సన్నాహము లెప్పుడు ప్రారంభించవలెనో ఎప్పుడు ముగించవలెనో నిర్ణయించకొనలేరు. ముఖకార్తిలో ప్రతిరోజు ప్రతినిమిషము నిరీక్షించుచుండవలసియుండును. ఇట్టిపరిస్థితిచే రైతును ముఖ్యముగా ఎదుర్కొనుచున్నది నారు, నాట్ల తీవ్రసమస్య ముఖకార్తిలోనో లేక అంతకుకొద్దిగా ముందో నీరు వదలబడుటచే నాట్లు పెట్టుకొని నెలల పెద్ద పంటపండించ వీలుండదు వచ్చిన నీరుతో ఏదో విధముగా లాభము పొందవలయునను ఉద్ధేశ్యముతోనే సేద్యముచే యుచున్నారు - కాని తృప్తికరముగా పైరు ఫలించు అవకాశము చిక్కుటలేదు. బావులు అధారముగాగల ఏ కొందరు రైతులో మాత్రమే ముఖకార్తికి మాసములకు ముందు నార్లకై సన్నద్ధులగురు. అనగా నాట్లుపెట్టుకొని మాసముల పంట పండించు రైతు మరియు నామకార్ధముగా విధిలేక ఏ నెలలో సమాన బాధ్యతకలిగియున్నా గొప్ప ప్రాజెక్టు ఉండియు నీరు ఉండియు రైతులు తిరిగి బావులతో బాధలు పడుటయు లేని వారు అలమటించుటయు సంభవించున్నది.
   (ఆ) అనుభూములకు ముఖకార్తిలోగా నీరు యిచ్చేది యివ్వనిది తెలుపుదురు. అప్పుడప్పుడు నీరు యివ్వ నిరాకరించి యిచ్చుటయు, యివ్వ అంగీకరించి నిరాకరించుటయు సంభవించుచున్నటుల తెలిసింది. దీనిచే రైతులు కడు నష్టములబడుచున్నారు. నీరు దొరుకునను ఆశతో ఖుష్కీ పైర్ల కైసన్నాహములు మాని నీటికొరకై నిరీక్షించుచుందురు. కాని ఆకస్మికముగా నీరు దొరకదని తెలిసికొని తరిహల్‌ ఖుష్కీ సేద్యము చేయును నీరు దొరకదని తెలిసి ఖుస్కీ సన్నాహాలు ప్రారంభించును అట్టి తరీ నీరు (చిన దోవెంటనేతరీగార) మార్చుటకై ఎన్నో అవస్థలకు గురికావలసివచ్చును. నార్లు లభించవు. నాట్లు పెట్టజాలరు. అందుచే రెండు విధముల నష్టములకు గురియై ముఖ్యమైన పూనాసపంట కోల్పోయి విధిలేక జొన్న పైర్లు వేయుచుందురు. అబ్బాషివారి వైఖరి కారణమున కొందరు రైతులు నీరు లభించినను తరీహల్‌ ఖుష్కీ సేద్యము చేసి భూమ్యాదాయశాఖవారి "అనవసరముగా తరీపైరు పెట్టలేదు" అను ఆక్షేపణకు గురియై తరీపన్ను చెల్లించుచుదురు. పై విధానముచే ఆయా సందర్భములందు ఖుష్కీ భూమి తరీగాను, తరీభూమి ఖుష్కీగాను వెంట వెంట మార్చబడుచుండుటచే పై రెండు విధములైన భూములను సారవంతమొనర్చుటలో పద్దతులనే (దైనందుఅనను) అట్టి అవకాశము లభించక రైతులు బుద్ధిపూర్వకముగా నష్టములపాలగుచున్నారు.
   వంపు తూము కాలువ యొక్క పరిమాణము అడుగులు. అంతకన్న ఎక్కువ నీరు ఆ కాలవనుండి ప్రవహింపజాలదు. అడుగుల నీరు (చే అను) భూములు అనగా గ్రామములకు సంబంధించినవి మాత్రమే సేద్యమగును. ఆ కారణముగ ప్రాజిక్టు లో ఎంత నీరున్నను (ఇ/ అనుభూములు అనగా తుది భాగములలో నున్న గ్రామములకు చెందిన భూములకును నీరు అందజాలదు. ప్రాజక్టు కట్టిన తరువాత వరుసగా నాలుగు సంవత్సరములు ప్రాజక్టు అలుగు పారి నీరుపోయినను పైన పేర్కొనిన (అ) (ఇ) అను భూములకు నీరు లభింపక (పణానాయందెనని) తెలిసినది. రైతులు ఇట్టి అవస్థలను భూమ్యాదాయశాఖవారికి తెలుపుకొనిన కారణముగా అప్పుడప్పుడు అధికారులు పర్యవేక్షణ జరుపుటకు వచ్చు సందర్భమున పై భూములకు కొన్ని ఆపివేసి క్రింది భూములకు తాత్కాలికముగా నీరు అందజేయుచుండిరని తెలియవచ్చినది. ఈ కారణముగ రైతులు మొఱ అనాలోచిత, అనవసర, అక్రమ ఆందోళనగా పరిణమించి ఫలితము పొందజాలకున్నారు.
   (ఇ) అను గ్రామాలకు సంబంధించిన భూముల ఆయాకట్టు నిర్ణయము జరిగినప్పటినుండియు నేటి వరకును నీరు గాని కాలవగాని ఏర్పాటు చేయబడనందున తరీసేద్యము చేయబడక ఖుష్కీ సేద్యము చేయుచు ఖుష్కీ పన్ను చెల్లించుచున్నారు.
   (అ) (ఇ) అను భూములకు చెందిన రైతులు ప్రాజక్టునీరుగాని, తరీసేద్యపు అవసరముగాని లేదనియు తమ భూములు ఖుష్కీ భూములుగా మార్చుకొనుటయే శ్రేయస్కరమనియును అభిప్రాయపడుచున్నారు.