ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 

               ఆంధ్రమహాసభలో తీవ్రవాదోపవాదాలు
               విశేషాలు - భువనగిరి సమావేశ వివరాలు

  మా ప్రత్యేక ప్రతినిధి
  నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభ 11వ సమావేశం నిన్న రాత్రి 22 గంటలకు విజయవంతంగా సమాప్తమైంది. ఆంధ్రమహాసభ చరిత్రలో ఈ సమావేశం లాంటిది ఇంతకుముందు కనీవినీ ఎరుగని విషయం అని పలువురు అనుకుంటుండడం నేనువిన్నాను.
  సమావేశాలకు ఇటువంటి సన్నాహాలు ఇంతకు మునుపు ఎన్నడూ జరుగలేదనీ, సమావేశానికి పందిళ్లు వేయడంలో నేమి, ప్రతినిధులకు బసల నేర్పరిచి, భోజనపు ఏర్పాటులను గమనించడంలో నేమి, భోజనపు ఏర్పాటులలో నేమి అదీ ఇదీ ఏమిటి అన్ని విషయాలలోనూ ఈ సమావేశం ఒక విశిష్టతనుగావించుకున్నదని లోగడ సమావేశాలను హాజరైనవారు చాలామంది అభిప్రాయపడ్డారు. సమావేశానికి దాదాపు 8,000 మంది కార్యకర్తలు హాజరైనారు. వివిధ జిల్లాలనుంచి వచ్చిన ప్రతినిధుల సంఖ్య 400కు పై చిలుకుంది.
  సమావేశం శనివారం సాయంత్రం 8 గంటలకు ప్రారంభమైంది. ప్రభుత్వానుమతి సకాలంలో అందనందున ఆరు గంటలకు చేస్తున్న సేవను ప్రస్తుతించి, ప్రభుత్వకార్య వర్గానికి ప్రజా ప్రతినిధులకు ఎన్నుకోవలసిందని మ.ఘ.వ. నిజాంవారికి నివేదించడంలో తాముకూడా ఆంధ్రమహాసభకు ఆసరాగా ఉంటామని ఉద్ఘాటించారు.
  అప్పటికి ఆ సమావేశం పూర్తి అయింది.ఆ రాత్రి వైజ్ఞానిక దళం వివిధ వినోద ప్రదర్శనలు చేశారు.తిరిగి నిన్న ఉదయం గం.11.15 లకు మహాసభ సమావేశమై, అంతకుముందు విషయ నిర్ణయసభవారు అంగీకరించినటువంటి తీర్మానాలను అంగీకరించడం జరిగింది. తర్వాత విషయనిర్ణయ సభ జరిగింది. విషయనిర్ణయసభలో ఎక్కువ వివాదానికి కారణమైనది. డాక్టర్‌ వుమ్మెత్తాల గోపాల రావుగారు తెచ్చిన తీర్మానం.
  ఆ తీర్మానం ఇదీ: "నిజాం రాష్ట్రములో ఆంధ్రోద్యమము ప్రారంభించిన నాటినుండి నేటివరకు ఆంధ్రమహాసభలో పాల్గొనుచు, ప్రజాసేవ చేయుచు, ప్రస్తుతం కొన్ని కారణములవలన తాటస్థ్యవిధానం అవలంబించిన జాతీయపార్టీ నాయకులందు, మరియు నాన్‌పార్టీ నాయకులందు పూర్తి విశ్వాసం కలదని ప్రకటించుచు, పూర్వమువలెనే మాట కాదనగలవారెవరూ ఉండరనీ, అసలు ఈనాటి యువకులను ప్రోత్సహించి, పైకి తీసుకువచ్చినది వారేనని, అట్టివారు ఏదో భేదాభిప్రాయం రాగా తటస్థంగా వుంటే మళ్ళీ వారు వచ్చి మాకు మార్గదర్శిగా వుండాలనడం నిర్భందం అవుతుందనీ, భేదాభిప్రాయాలుండడం ప్రజాస్వామిక సూత్రాలలో మొదటిదనీ, కనుక అసలు ఈ తీర్మానాన్ని తేవడమే తప్పని వారన్నారు.
  ఆళ్వారు స్వామి గారు తమ సవరణను ఉపసంహరించుకున్నారు.
  తీర్మానం ఓటుకు పెట్టగా వీగిపోయింది.తిరిగి, భోజనాలైన తర్వాత మధ్యాహ్నాం సుమారు 4.30 గంటలకు విషయనిర్ణయసభ సమావేశమైంది.ఈసారి, వట్టికోట ఆళ్వారుస్వామి గారు ప్రతిపాదించిన "మహాసభ విధానం" కుసంబంధించిన తీర్మానం వివాదానికి మూలమైంది.
  పోల్కంపల్లి వెంకట్రామా రావుగారు ఇన్నేళ్ళుగా వుంటూవున్న మహాసభ విధానం విషయమై ఇప్పుడు ఒక తీర్మానం తేవడం అనవసరం అని, ఈ తీర్మానం ఉదయం ఓడిపోయిన తీర్మానానికి వేరొక రూపమేనని కొందరన్నారు ఈ తీర్మానాన్ని జాగ్రత్తగా చూసి అవసరమైన మార్పులను చేయాల్సి ఉందని కాళోజీగారు కోరారు.
  సమావేశ ప్రారంభానికి ముందు అధ్యక్షులు శ్రీరావి నారాయణరెడ్డిగారు అందంగా అలంకరింపబడిన ఎడ్లబండిలో ఊరేగించబడ్డారు. బండికి 11 జతల ఎడ్లు కట్టబడినాయి. ఊరేగింపు బాజా భజంత్రీలతో స్వచ్ఛంద దళం బారులు తీర్చి ముందు నడవగా బ్రహ్మాండంగా జరిగింది.
  ఊరేగింపులో, అధ్యక్షులు సభవేదికనలంకరించేసరికి అయింది. ప్రార్థనాదికాల అనంతరం ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీ ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డిగారు ప్రతినిధులకూ ప్రేక్షకులకూ స్వాగత వచనాలు చెప్పి (వారి ఉపన్యాసం మీజాన్‌ లో మొన్ననే ప్రకటితమైంది) శ్రీ రావి నారాయణ రెడ్డిగారిని అధ్యక్ష స్థానాన్ని సహించవలసిందిగా కోరారు.
  శ్రీ రావి నారాయణరెడ్డిగారు ఈ జయజయధ్యానాలమధ్య అధ్యక్షస్థానాన్ని అధిష్టించి, తమ అధ్యక్షోపన్యాసములో నిజాంరాష్ట్రంలోని ఆంధ్రుల అభివృద్ధికి దారిచూపే మార్గాలను విశదీకరించారు. (వీరి ఉపన్యాసం యావత్తు 'మీజాన్‌' ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది).
  అధ్యక్షోపన్యాసం ఆయాక, ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌కు చెందిన ఒక నాయకుడూ, మహారాష్ట్ర మండలికి చెందిన ఒక నాయకుడూ రాష్ట్ర రాజకీయరంగంలో ఆంధ్రమహాసభ కలదని ప్రకటించుచు, పూర్వమువలెనే ఇకముందుకూడా మహాసభ ఉద్యమమునకు వారి మార్గదర్శకత్వము అవసరమని ఈ మహాసభవారు తలచుచున్నారు."
  పై తీర్మానంలోని ఆఖరు వాక్యంలోగల "... వారి మార్గదర్శకత్వము..." అన్న దాంట్లో "మార్గదర్శకత్వము" అను మాటకుబదులు 'సహకారం' అని ఉండడం సమంజసమని నండూరి కృష్ణమాచార్యులుగారు ఒక సవరణ తెచ్చారు. అది అంగీకరింపబడింది.
  దత్తాత్రేయ శర్మగారు మాట్లాడుతూ జాతీయనాయకులపట్ల విశ్వాసంలేదని ఎప్పుడూ ఎవ్వరూ అనలేదుగనుక ఈ తీర్మానానికి ప్రసక్తిలేదన్నారు. కాళోజీ నారాయణరావు గారు మాట్లాడుతూ విశ్వాసం లేనట్లు విస్పష్టంగా ప్రకటించకపోయినా అందుకు సమానమైన పనులు జరిగాయనీ గనుక దీనికి ప్రసక్తి లేకపోలేదనీ అన్నారు.
  వట్టికోట ఆళ్వారుస్వామి గారు పైతీర్మానానికి ఈదిగువ సవరణను ఉపపాదించారు.
  'నేడు ఆంధ్రమహాసభలో ఏర్పడిన చీలికలకు చాలా విచారించుచు అంతమాత్రమున ఈ సంస్థ ఏదేని ఒక పక్షమునకు చెందినదిగా పరిణమించలేదనియూ, సంస్థస్థాపన నాటినుండి నేటివరకూ సర్వతోముఖాభివృద్ధికి కారకులనదగువారిని హృదయపూర్వకముగా గౌరవదృష్టితో చూచుచున్నారు."
  పోల్కంపల్లి వెంకట్రామారావుగారు మాట్లాడుతూ జాతీయనాయకులు, ముఖ్యంగా శ్రీ మాడపాటి హనుమంతరావుగారి లాంటి వాళ్ళు. ఆంధ్రోద్యమానికి చాలా సేవచేసిన ఆళ్వారుస్వామి మహాసభ చర్చించ వచ్చునని చెప్పారు.
  ఇతరత్రా కొన్ని తీర్మానాలు చర్చింపబడినాక సుమారు 9 గంటలకు విషయనిర్ణయ సభ సమాప్తమైంది.
  మళ్ళీ 8.30 కు మహాసభ ప్రారంభమైంది. ప్రారంభంలో శ్రీ రామానంద తీర్థగారు రాష్ట్ర రాజకీయరంగం గురించి పదిహేను నిమిషాలసేపు ప్రసంగించారు. అనంతరం తీర్మానాలపై చర్చలు ప్రారంభమైనాయి. ఆళ్వారు స్వామిగారి తీర్మానాలపై కాళోజీగారు తెచ్చిన సవరణా, ఆయనంతట ఆయన తెచ్చిన జాతీయవాద తీర్మానమూ కొంచెం చర్చకు కారణాలయాయి.
  ఆహ్వాన సంఘాధ్యక్షుల కృతజ్ఞతా వందనాలతో సభ ముగిసింది. ప్రతినిధుల తరపున ఆళ్వారు స్వామిగారు ఆహ్వానసంఘాధ్యక్షుల్ని అభినందించారు.