ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 

               ఆళ్వార్‌
                   -శ్రీ కాళోజీ నారాయణరావు

  'ఆళ్వార్‌' ఏదో ఒక మనిషి పేరు కాదు.
   అదో విధానము, విధానమంటే ఏదో
   ఒక కార్యవిధానము కాదు. అదొక జీవిత విధానము.
   ఆ జీవిత విధానం కూడా కేవలం వ్యక్తిగతవలయం కాదు.
   సాలీడు గూడు కాదు. 'ఆహార నిద్రాభయమైథునాని'తో
   తొణికిసలాడి వొడిసిపొయ్యే బురదగుంట కాదు.
   ఆ జీవిత విధానం ఒక జీవనదీ ప్రవాహం.
   ఎన్నెన్నో పిల్లవాగులను తనలోకలుపుకొని వాటికి
   తన ఘనతంతా ధారబోసి, సమైక్య జీవనానికి ప్రతీకగా,
   గుర్తుగా, పారాడు నిత్య ధారావాహిని యగు జీవిత విధానమునకే
  'ఆళ్వార్‌' అని పేరు. అట్టి సమైక్య జీవన విధానమును పాటించిన వ్యక్తులే 'ఆళ్వారులు'. ఆళ్వార్లు అందరూ ఒకేసారి వెలిసినవారు కారు. ఒకేచోట వెలసిన వారు కాదు. అసలు 'ఆళ్వార్‌' అన దగినవాడు ఎవడూ లేడూ అనే కాలంకూడ ఏనాడు లేదు. సమాజం దృష్టికి వారి అందినారా లేదా? అనేది వేరుమాట.
   అందరు ఆళ్వార్ల 'జాబితా' తయారైందా లేదా?
   అందరు ఆళ్వార్ల చరిత్ర వ్రాయబడిందా లేదా? అన్నది వేరు.
   ఆళ్వార్లు వున్నారు. వుండిరి. ఉంటారు. అంతే వారు నిత్యజీవులు.
   ఇది 'ఆళ్వార్ల' కథ. చరిత్ర. గతం. ఇది 'ఆళ్వార్ల' ఉనికి.
   జీవితం, వర్తమానం. ఇది 'ఆళ్వార్ల' భవిష్యత్తు. రాబోవు జన్మల వృత్తాంతం జాతకం.
   వాడు మనిషి, వాడు నా మనిషి, వాడు మా మనిషి. వాడు మన మనిషి. వాడు ప్రజల మనిషి. వాడు కొడుకు. వాడు తండ్రి. వాడు అన్న. వాడు తమ్ముడు. వాడు స్వామి. వాడు భృత్యుడు. వాడు జశీఎజూశీరఱ్‌శీతీ. వాడు జశీఎజూశీరవతీ. వాడు ప్రచురణకర్త. వాడు రచయిత. వాడు వ్యవస్థాపకుడు. వాడు వ్యవస్థ. వాడు గ్రంథమాల. వాడు గ్రంథం. వాడు జపమాల. వాడు జపం. వాడు గతానికి విరోధి. వాడు గతాన్ని పరిశోధించిన ధురంధరుల (ఆదిరాజు, దూపాటి మొ.) ఆరాధకుడు. వానికి నా గొడవ ప్రాణం. వానమామలై 'పోతన' ప్రాణాధారం. వానికి 'ఆత్మవేదన' (పొట్లపల్లి) భగవద్గీత.
   'కురళ్‌' సాక్షాత్‌ భగవంతుడు.
   వాడు 'అమ్మా' అని పిలిచి అన్నమడిగేవాడు. అమ్ముల పిలిచేవాడు. ఇమ్ముగ చదివేవాడు. ఎవ్వరేది చెప్పినా శ్రద్ధగా వినేవాడు. విన్నదాని విషయమై ఆలోచించేవాడు. నిజానిజాలు తెలుసుకునేవాడు.
   వాడరక్కరకు వచ్చే చుట్టం.
   వాడజాతశత్రువు. ఒంటరిగానే ప్రయాణం చేసేవాడు.
   ఎవరింటిలోనైనా నిస్సంకోచంగా భోజనం చేసేవాడు.
   తన మనసు కెంత నొప్పి కలిగినా ఎవరి మనసు నొప్పించేవాడు కాదు.
   తప్పించుకొని తిరిగేవాడు కాడు. ఐనా ధన్యుడు.
   నెలవు తప్పినా చెలిమి తప్పేవాడు కాడు.
   వాడు అర్చకుడు. లక్ష్యార్చనలో 'కాలధర్మము నొందిన వాడు'.
   వాడు భీముడంతటివాడు. అందుకే వానికి 'విరటుని కొలువు'
   తప్పలేదు. వాడు చిత్రగుప్తుడు. కరణీకం దగ్గరినుండీ
   కార్యదర్శి నివేదికల దాకా వాని కలం చాకిరీ.
   'రామప్పరభస' నుండి 'ప్రజలమనిషి' స్థితప్రజ్ఞ దాకా
   దొరుకుతుంది వాని రచనల్లో భోగట్టా.
   'ఆంధ్రమహాసభల' నుండి 'అంతర్జాతీయ శాంతి సభల' దాకా
   వ్యాపించిన వాడు వాడు.
   గుమాస్తా సంఘం నుండి 'ఐటక్‌'(ూIుఖజ) దాకా వాని బైఠక్‌.
   'గర్భ గుళ్ళ' నుండి 'కమ్యూన్ల' దాకా వాని గోప్యాలు.
   కమ్యూనిస్టు పార్టీవారికి తప్ప మరెవ్వరికీ వాడు కమ్యూనిస్టు కాదు.
   వాడు ఎప్పుడు వచ్చినా, ఎక్కడికి వచ్చినా, ఏ పనిబడి వచ్చినా స్నేహితుడే, సన్నిహితుడే.
   వాని ఉనికి ఎవరికీ బరువనిపించేది కాదు.
   అంత భారీ మనిషి వాడు.
   వ్యవహారంచే మలచబడిన మనిషి కాడు,
   వాడు వ్యవహారాలను మలచిన మనిషి.
   సంబంధాలచే వెలసిన మనిషి కాదు,
   వాడు సంబంధాలను వెలయింప చేసిన మనిషి.
   సంస్థలచే ఎదిగిన మనిషి కాదు,
   వాడు సంస్థల పెంచిన మనిషి,
   సభలచే రాణించిన వాడుకాదు.
   డు 'చరిత్ర కారుడే' కాదు.
   వాడు స్వయంగా చరిత్ర.
   అయినా 'ఆళ్వార్‌' మహాధూర్తుడు.
   చూచేవారందరికీ వాడు లక్షాధికారి. ఆనంద స్వరూపుడు.
   మహా ఆరోగ్యవంతుడు.
   వాస్తవంలో వానికున్న ఆర్థిక ఇబ్బందులూ, మానసిక బాధలూ, రోగాలు ఇన్నీ అన్నీ కావు.
   "తాను వేదనా భరితమయ్యు ఇతరుల ఆనందంతో సంతోషంగా పాల్గొనే ఆ హృదయం ఎంత
   ఉదాత్తమైనదో!""
                ఖలీల్‌ జిబ్రాన్‌
            (గంగు (20173) నవల నుండి విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారి సౌజన్యం)