ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 

              ఆళ్వారు మట్టిపోరు
                   - దేశపతి శ్రీనివాస్‌

వందనాలు ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారూ!
పలుకుతోంది పిడికిలెత్తి తెలంగాణ జోహారూ!!

కన్నతల్లి కడుపులోన కల ఏదో కన్నావు
ఉద్యమాల ఉగ్గుబువ్వ చిన్ననాడె తిన్నావు
బతుకు పోరులోన జనం వెతల హోరు విన్నావు
వందనాలు ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారూ!
ఉప్పెనగా ఎగిసిపడిన వెట్టిబతుకు కన్నీరూ!!  ||వంద||

ఆదర్శం మూటగట్టి నెత్తుకెత్తుకున్నావు
ఆశయాల పుస్తకాలు ఊరూరుకు పంచావు
గ్రంథమాల కట్టి చరిత బంధనాలు విప్పావు
గ్రంథాలయ ఉద్యమమై గడికి ఎదురు నిలిచావు
వందనాలు ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారూ!
రజాకార్ల నెదురొడ్డిన అక్షరాల కైజారూ!! ||  వంద||

జైలులోన జనజీవన విలువలు కనుగొన్నావు
కులమతాల పాదులల్ల కూడు పుట్టదన్నావు
భూస్వామ్యం కూల్చకుండ బువ్వ దొరుకదన్నావు
భూ విముక్తి ఉద్యమంల మువ్వకట్టి నిలిచావు
వందనాలు ప్రజలమనిషి వట్టికోట ఆళ్వారూ!
అగ్నిధార అలుముకున్న త్యాగాల సెలయేరూ!!  ||వంద||

కాలాన్నే చీల్చుకొని కలమై తిరిగొస్తావా
కాటగలిసె తెలంగాణ బాటలు నిర్మిస్తావా
వలస తెరలు కమ్మేసిన వెలుగులు వివరిస్తావా
వందనాలు ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారూ!!
మల్ల నిన్ను పిలుస్తోంది తెలంగాణ మట్టిపోరూ!!
||వంద||