ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 
               "ప్రజలమనిషి"
నిష్కామ మనిషి
ప్రజాసేవ తపసి
నిర్విరామంనెత్తురుపిండి
అగ్ని అక్షర తూణీరంతో
నిజాం కబంధహస్తాలకి
చిచ్చు పెట్టిన జాగృతి
తురకల ముష్కరత్వం
ప్రజాఉద్యమ వాహినిని
జైల్లో నిర్మానుష్యంగా అణిచితే,
"జైలులోపల" రచించి
తెలంగాణ తెలుగు రక్తాన్ని
ఎడారిలో ఒయాసిస్‌గా మార్చి
రాజ్యకాంక్ష ముష్కరులను
సామాన్యుల నిరుపేదల బంధువై
నీటముంచిన "ప్రజలమనిషి"
మరుగుపడిన మాణిక్యాలను త్రవ్వే,
వెలుగుతున్న వజ్రాలను మార్చే,
ఈ జాతి చస్తేనే గాని కొలవదు!
ఇది నిజం ! స్వామిగారు !
వ్యక్తి ఒక మహా సంస్థ
సంచార విజ్ఞాన గ్రంథం,
పదవి - బిరుదులతో కాదు
జిజ్ఞాసలో జ్వలిస్తేనే
మనగలిగే సృజన కర్త
అని సజీవంగా చూపిన
నీకు - మా అశ్రు తర్పణ.
                         - కె. యాదవరెడ్డి
(గోలకొండ దినపత్రిక 26-02-1961 నుండి)