ఆళ్వారుస్వామి కవితలు

ఆళ్వారుస్వామి కథ

ఆళ్వారుస్వామి నాటిక

Jambi

సంచికలు


నివాళులు


స్మృతి కవితలు


అంకితాలు


జ్ఞాపకాలు


వ్యాసాలు


 
MediMarg
 
 

   "ఆంధ్రుల విజ్ఞానాభివృధ్దికి శ్రమింపుచున్నట్టి వీరి గ్రంథమాలను అందరూ ఆదరించి. తమ విధిని నెరవేర్చవలసి యుండును."  - సురవరము ప్రతాపరెడ్డి

   "ఈ గ్రంథమాల రూపమున తమరు చేయుచున్న ఆంధ్రభాషా సేవ ప్రశంసనీయమైయున్నది".  -మాడపాటి హనుమంతరావు

   "దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి, ఆంధ్రదేశమున గొప్ప భాషాసేవ చేసిన దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు గారిని చిరస్మరణీయులు చేసినారు."   -కొండా వెంకటరంగారెడ్డి

   "దేశీయులందరు గ్రంథమాల యొక్క ప్రచురణలను పొంది ఈ కార్యమును జయప్రదముగ నిర్వహించుటలో సహాయపడుదురని ఆశించుచున్నాను."   -మందుముల రామచంద్రరావు

   ప్రతి పుస్తకము ఆకర్షవంతముగను, ఉపయోగకరముగను ఉన్నది... మీ గ్రంథమాల ఆంధ్రదేశమునకమూల్యమగు సేవ చేయుచున్న దనుటలో నెట్టి యతిశయోక్తి లేదు."   -అయ్యదేవర కాళేశ్వరరావు

   "ప్రజలకు వినోదము గలిగించుటవల్ల గ్రంథమాలను అభివృద్ధి చేసుకొనే దృష్టి ప్రకాశకులకు లేదు. 'ప్రజలకు ఈ దినాలలో అత్యావశ్యకమయిన విజ్ఞానం కలిగించాలి' అన్న ధృడ సంకల్పం ప్రతి ప్రచురణమందు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంది."   -కాగడా 10-02-1940 (తాపీ ధర్మారావు)

   "కొత్త జాతి కథలు మీరు తెలుగులో సృష్టిస్తున్నారు... కథలు హృదయవిదారకంగా ఉన్నవి. పడమటి దేశాల్లో ఇట్టి వాఙ్మయ సృష్టి సంస్కరణలకి దారి తీసేది. మన దేశంలో ఆలనా పాలనా లేదు."   -'జైలు లోపల' కథలపై దీక్షితులు

   "కాళోజీ నిఖిలాంధ్రకవి... ఆయన తన ఖండకావ్య సంపుటానికి 'నాగొడవ' అని పేరు పెట్టారు. ...కాని ఇది విశాలజగత్తు ప్రజలందరి గొడవ. ఇది మనం మననం చేసుకోవాల్సిన పుస్తకం. యుద్ధంలో పాల్గొన్న కవులంతా చెల్లాచెదురుగా పారిపోతే లూయీ ఆరగాన్‌ ఒక్కడే దేశంలో నిలబడి మహావిశ్వాసాన్ని వెల్లడించే గీతాలు వ్రాశాడు. కాళోజి లూయీ అరగాన్‌ వంటివాడు."   -దేశోద్ధారక గ్రంథమాల ప్రచురణ 'నాగొడవ'పై శ్రీశ్రీ

   "ఇప్పుడు ఆంధ్రదేశంలో అనేక తరహాల కవిత్వం ఆవిర్భవిస్తున్నప్పటికి అందులో ప్రధాన ప్రవాహం అభ్యుదయ సాహిత్యం. దీనికి కారణం దినదిన ప్రవర్ధమానమౌతున్న సామాజిక చైతన్యమూ, ప్రజాజీవితమూ దీనిలో వెల్లివిరియడమే. ఇలాగ వెల్లివిరిసిన అఖిలాంధ్ర కవుల గీతికా సంపుటి 'ఉదయఘంటలు,'... అనేక కవుల చక్కని గీతాలు యిందులో ప్రచురితమైనాయి. ...సంపాదకుల, ప్రచురణకర్తల కృషి కొనియాడదగింది."

   -1953లో తెలంగాణ రచయితల సంఘం సంపాదకత్వంలో దేశోద్ధారక గ్రంథమాల వెలువరించిన 'ఉదయఘంటలు' కవితా సంకలనం సమీక్షలో విశాలాంధ్ర పత్రిక.

   "...ఈనాడు ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం, జాతీయత స్వేచ్ఛగా అనుభవిస్తున్న ప్రజలకి ఆనాడు తెలంగాణ ప్రజలు పడిన బాధలు తెలియవు. ఈ నవల చదివితే మాత్రం ప్రతి పుటలోను తెలంగాణ హృదయం స్పందిస్తూ ఉన్నట్లు, భరించిన అవమానాల పరంపరతో పరాజయం పొందినా గాని పట్టుదలతో నిలిచిన ప్రజల మనిషి పలుకరిస్తున్నట్టు కనిపిస్తుంది. "ప్రజల మనిషి" తెలుగు సాహిత్యంలో ఉత్తమ శ్రేణికి చెందతగిన మరొక నవల."  -శ్రీవాత్సవ, తెలుగు స్వతంత్ర